Stunning Earth Views from NISAR Satellite | భూమికి అందిన నిసార్ తొలిచిత్రం

నాసా-ఇస్రో సంయుక్తంగా తయారుచేసిన NISAR (నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్) ఉపగ్రహం భూమి యొక్క తొలి రాడార్ చిత్రాలను విడుదల చేసింది. ఇందులో భూమి ఉపరితలం, అడవులు, వ్యవసాయం, భూభాగం వంటి అద్భుతమైన వివరాలు కనిపించాయి. ఈ వీడియోలో ఆ ఫొటోలు మరియు వాటి ప్రాముఖ్యతను తెలుసుకుందాం. 🌍

ఈ వీడియోలో మీరు చూస్తున్న చిత్రం నిసార్ శాటిలైట్ పంపిన మొట్టమొదటి చిత్రం. భూమి ఉపరితలం శాటిలైట్ కు ఈ విధంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో అటవీ ప్రాంత డెన్సిటీ అలాగే భూమిమీద ఉన్న తడి, పొడి నేలల వివరాలు, అర్బనీకరణ అనే విషయాలను శాటిలైట్ సుదూర ప్రాంతాల నుంచి చిత్రీకరించి భూమికి పంపించింది. ఈ చిత్రాన్ని శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు.

  • నిసార్ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA (నాసా) మరియు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO (ఇస్రో) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఒక ఉపగ్రహ కార్యక్రమం.
  • ఈ ఉపగ్రహం భూమిని పరిశోధించడానికి, భూమి ఉపరితలం, మంచు ప్రాంతాలు, పర్యావరణ వ్యవస్థల్లోని మార్పులను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది.
  • ఇది భూమి ఉపరితలంలోని మార్పులను, భూకంపాలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలను చాలా వివరంగా, సెంటీమీటరు స్థాయి కదలికలను కూడా కొలవగల సామర్థ్యం కలిగి ఉంది.
  • ఇందులో ఎల్-బ్యాండ్ (L-band) మరియు ఎస్-బ్యాండ్ (S-band) అనే రెండు రకాల రాడార్ ఫ్రీక్వెన్సీలు ఉంటాయి. నాసాకు చెందిన ఎల్ బ్యాండ్ అడవులు, పర్వతప్రాంతాలు, అలాగే భూకంపాలు, ల్యాండ్ స్లైడ్ లు వంటివాటిని గుర్తించగలిగితే మన ఇండియాకు చెందిన ఎస్ బ్యాండ్ రాడార్ వ్యవసాయ భూములు, నదులు, పచ్చని మైదానాలు వంటివాటిని గుర్తించి చిత్రాలను మన శాస్త్రజ్ఞులకు పంపిస్తుంది. 
  • మేఘాలు ఉన్నా లేదా చీకటిగా ఉన్నా ఈ శాటిలైట్ భూమి ఉపరితలాన్ని పరిశీలించగలదు. భూమి యొక్క సంక్లిష్టమైన సహజ ప్రక్రియలను, వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడానికి, విపత్తుల నిర్వహణకు ఈ డేటా చాలా కీలకం.
  • ఈ ఏడాది జూలై నెలలో ఈ శాటిలైట్ ఇస్రో, నాసాలు సంయుక్తంగా  విజయవంతంగా ప్రయోగించారు.
  • ఈ చిత్రం ఆగస్టులో శాటిలైట్ చిత్రీకరించగా, తాజాగా వెల్లడించారు. 
  • నిసార్ లో ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ అనే రెండు రాడార్ వ్యవస్థలు ఉన్నాయి.  వీటిద్వారా భూమిమీద జరిగే మార్పులను శాస్త్రజ్ఞులు గుర్తించి ముందు జాగ్రత్తచర్యలు తీసుకోవడానికి వీలుంటుంది.  

Post a Comment

0 Comments