అనితరసాధ్యమైన శిల్పకళ - ప్రపంచంలోనే ఐదు అద్భుత నిర్మాణాలు

ప్రపంచంలోనే గొప్ప శిల్పకళకు ఆలవాలంగా నిలుస్తున్నాయి. ఈ ఐదు దేవాలయాలు. మానవమాత్రుల వల్లే సాధ్యమైందా ఈ అద్భుతం లేదా ఆ దైవమే నిర్మించిందా అనిపించే ఈ అరుదైన నిర్మాణాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అటువంటి భూమిమీద ఉన్న ఐదు అపురూప నిర్మాణాల గురించి తెలుసుకుందాం.  

1. బేలూరు చెన్న కేశవ ఆలయం

 కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని బేలూరు పట్టణంలో ఉన్న ఒక ప్రసిద్ధ దేవాలయం చెన్నకేశం దేవాలయం. ఇది ఒక దేవాలయంగా కాకుండా ఆనాటి శిల్పులు తయారు చేసిన అద్భుత కళాఖండంగా కూడా చెప్పవచ్చు. ఇది హోయసల రాజు ఆద్వర్యంలో శాలివాహన శకం 1117లో చోళులపై సాధించిన విజయాన్ని పురస్కరించుకుని నిర్మించబడింది.

ఆ ఆలయ నిర్మాణం ప్రపంచ అద్భుతాలలో ఒకటి. శిల్పులకు ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి మూడు తరాలకు పైగా అంటే 103 సంవత్సరాలు పట్టింది. ఇది హోయసల రాజుల శిల్పకళకు అద్దం పట్టే అద్భుతమైన దేవాలయం. సున్నితమైన సున్నపురాయితో నిర్మించిన ఈ ఆలయం, నక్షత్రాకారంలో ఉంటుంది.

ఈ ఆలయంలోని శిల్పాలు అత్యంత సున్నితంగా, కళాత్మకంగా చెక్కబడి ఉంటాయి. రామాయణ, మహాభారత, భాగవత పురాణాలలోని ఘట్టాలను, వివిధ నాట్య భంగిమల్లో ఉన్న అప్సరసలను, దేవతలను, జంతువులను ప్రతి గోడపైనా చెక్కారు. శిల్పాలు సజీవంగా ఉన్నాయా అని సందేహం కలిగేలా ఉంటాయి. ఆలయంలోని స్థంబాలు చెక్కిన తీరు చూస్తే పనితీరు ఏంతటి అద్భుతమైనవో తెలుస్తుంది. ఆ కాలంలో ఈ అద్భుత నిర్మాణ ఎలా సాధ్మపడిందన్న అనుమానం కలుగక మానదు.

ఈ దేవాలయం కేవలం భక్తులకు మాత్రమే కాకుండా, శిల్పకళా ప్రియులకు, చరిత్రను ఇష్టపడేవారికి ఒక గొప్ప అనుభూతినిస్తుంది. అందుకే ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రపంచం నలుమూలలనుండి ఈ అద్భుత కళాఖండాన్ని చూసేందుకు తరలి వస్తున్నారు. 

2. హలిబీడు హోయసలేశ్వర ఆలయం

హళిబేడులోని హోయసలేశ్వర దేవాలయం, కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఉన్న ఒక చారిత్రక కట్టడం. ఇది హోయసల సామ్రాజ్యం యొక్క కళాత్మక వైభవాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ ఆలయాన్ని శాలివాహన శకం 12వ శతాబ్దంలో హోయసల రాజులు నిర్మించారు. దీని నిర్మాణం ఒక శతాబ్దం పాటు కొనసాగింది, అయితే తుగ్లక్ దండయాత్రల వల్ల ఆలయ గోపురాలు అసంపూర్తిగా ఉండిపోయాయి.ఇది హోయసల శిల్పకళకు పరాకాష్ట. ఆలయం మొత్తం మెత్తటి సోప్‌స్టోన్ (బలపపు రాయి)తో నిర్మించబడింది. బయటి గోడలపై రామాయణం, మహాభారతం, భాగవత పురాణాలలోని కథలు, వివిధ దేవతలు, జంతువులు, పక్షులు, మరియు నృత్య భంగిమలు అద్భుతంగా చెక్కబడ్డాయి. ఒక్కో శిల్పం సజీవంగా ఉన్నట్లుగా సూక్ష్మమైన వివరాలతో ఉంటుంది. ఈ దేవాలయం శివుడికి అంకితం చేయబడింది. 

హళిబేడులోని హోయసలేశ్వర దేవాలయం ఒక్కటే కాకుండా, బేలూరులోని చెన్నకేశవ దేవాలయం మరియు సోమనాథపురలోని కేశవ దేవాలయం కలిపి "పవిత్ర హోయసల ఆలయ సముదాయం" పేరుతో 2023లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడ్డాయి.

ఈ ఆలయాలు హోయసల శిల్పుల అత్యున్నత సృజనాత్మకతకు, కళాత్మక మేధస్సుకు నిలువుటద్దాలుగా నిలిచాయి. ఇవి దక్షిణ భారతదేశ ఆలయ నిర్మాణ చరిత్రలోనే కాకుండా ప్రపంచంలో ఒక ముఖ్యమైన  వైవిధ్య నిర్మాణ శైలికి నిదర్శనంగా ఉన్నాయి.

3. Somanadhapura చెన్న కేశవ టెంపుల్

కర్ణాటక రాష్రంలోని మైసూర్ జిల్లాలో సోమనాథపుర పట్టణంలో ఉన్న ఒక అద్భుతమైన హోయసల ఆలయం. ఈ చెన్నకేశ్వర ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, హోయసల శిల్పకళ యొక్క పరిపూర్ణతకు నిదర్శనం.

ఈ ఆలయాన్ని శాలివాహన శకం268లో హోయసల రాజు మూడవ నరసింహ యొక్క సేనాధిపతి సోమనాథుడు నిర్మించాడు. అందుకే ఈ గ్రామానికి అతని పేరు మీదుగా "సోమనాథపుర" అని పేరు వచ్చింది.

ఈ ఆలయం కూడా నక్షత్రాకారంలో ఉన్న ఒక ఎత్తైన వేదికపై నిర్మించబడింది. గోడలపై రామాయణ, మహాభారత, భాగవత పురాణాలలోని ఘట్టాలు, విష్ణుమూర్తి యొక్క వివిధ అవతారాలు, దేవతలు, జంతువులు, సంగీతకారులు మరియు నృత్యకారుల బొమ్మలు అత్యంత సున్నితంగా, కళాత్మకంగా చెక్కబడ్డాయి. ఈ శిల్పాలలో ప్రతి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి.

ఆలయం లోపల, బయట గోడల మీదే కాకుండా పైకప్పులు, స్తంభాలు కూడా అద్భుతంగా చెక్కబడ్డాయి. వలయాకారంలో చెక్కబడిన పైకప్పులు, లోపల ఉన్న 16 స్తంభాలు కూడా ఆనాటి కళాత్మకతకు గొప్ప ఉదాహరణ.

ఈ ఆలయాలు హోయసల శిల్పుల అత్యున్నత సృజనాత్మకతకు, కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచాయి. వాటి అద్భుతమైన శిల్పకళ, ఆలయ నిర్మాణం, సంస్కృతుల కలయిక వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని యునెస్కో తన వారసత్వ ప్రదేశాలలో స్థానం కలిపించింది. ఈ గుర్తింపుతో ఈ ఆలయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరిగింది. 

4. తంజావూరు బృహదీశ్వర ఆలయం

తమిళనాడు రాష్రంలోని అతి పెద్ద, అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో తంజావూరులోని బృహదీశ్వర దేవాలయం ఒకటి. ఇది కేవలం ఒక దేవాలయంగానే కాకుండా శిల్పకళలో ఒక అద్భుతానికి వేదికగా నిలుస్తుంది. ఇది చోళ సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని, వారి అద్భుతమైన నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1003-1010 మధ్య కాలంలో చోళ చక్రవర్తి మొదటి రాజరాజ చోళుడు నిర్మించాడు. ఈ ఆలయం నిర్మాణంలో పూర్తిగా గ్రానైట్ రాళ్లను ఉపయోగించారు. ఇది పూర్తిగా ఒకే రాతితో నిర్మించిన భారతదేశంలోని మొదటి ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలికి ఒక గొప్ప ఉదాహరణ. 216 అడుగుల ఎత్తు ఉన్న దీని ప్రధాన గోపురం (విమానం) దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది. 80 టన్నుల బరువున్న ఒకే గ్రానైట్ శిలతో చేసిన ఏకశిలా కలశాన్ని ఆలయ గోపురం చివరకు అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. 

ఆలయం లోపల, బయట అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ప్రధాన ఆలయం ముందు 20 టన్నుల బరువు ఉన్న పెద్ద నంది విగ్రహం ఉంటుంది. ఆలయ గోడలపై భరతనాట్యానికి సంబంధించిన 81 భంగిమలు చెక్కబడ్డాయి. ఈ బృహదీశ్వర దేవాలయం ఒక గొప్ప జీవన చోళ దేవాలయాలు" పేరుతో 1987 లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు. చోళుల నిర్మాణ నైపుణ్యం, అద్భుతమైన శిల్పకళ, మరియు అప్పటి సామాజిక, సాంస్కృతిక జీవన విధానాన్ని ఈ ఆలయాలు ప్రతిబింబిస్తాయి. ఈ చారిత్రక, సాంస్కృతిక, కళాత్మక విలువలను గుర్తించి యునెస్కో ఈ హోదాను కల్పించింది.

5. అజంతా ఎల్లోరా గుహలు

అజంతా, ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఈ గుహలు భారతీయ చరిత్ర, కళలకు అద్దం పడతాయి. వీటిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించడం వాటి ప్రాముఖ్యతకు నిదర్శనం.

అజంతా గుహలు క్రీ.పూ. 2వ శతాబ్దం నుండి క్రీ.శ. 5వ శతాబ్దం మధ్య కాలంలో బౌద్ధ మతానికి చెందిన సన్యాసులచే నిర్మించబడ్డాయి. ఈ గుహలు వాఘోరా నదికి ఎదురుగా గుర్రపుడెక్క ఆకారంలో ఉన్న ఒకే కొండపై చెక్కబడ్డాయి. అజంతా గుహలు వాటి అద్భుతమైన కుడ్యచిత్రాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ చిత్రాలు బుద్ధుని జీవితాన్ని, జాతక కథలను వివరిస్తాయి. ఈ చిత్రాలలో ఉపయోగించిన రంగులు వేల సంవత్సరాల తర్వాత కూడా చెక్కుచెదరకుండా ఉండటం ఆ కాలం నాటి కళాకారుల నైపుణ్యాన్ని తెలియజేస్తుంది.

ఎల్లోరా గుహలు

ఎల్లోరా గుహలు అజంతాకు దాదాపు 100 కి.మీ. దూరంలో ఉన్నాయి. వీటిని క్రీ.శ. 6వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యలో రాష్ట్రకూట మరియు చాళుక్య రాజవంశాల పాలకులు నిర్మించారు. ఎల్లోరా గుహల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి హిందూ, బౌద్ధ, మరియు జైన మతాలకు చెందిన దేవాలయాలు మరియు మఠాల సముదాయం. ఇది ఆ కాలంలో భారతదేశంలో ఉన్న సర్వమత సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది.

ఎల్లోరాలోని 16వ గుహలో ఉన్న కైలాసనాథ దేవాలయం ఒక అద్భుతమైన ఏకశిలా నిర్మాణం. ఇది ఒకే పెద్ద కొండను పైనుంచి కిందకు తొలిచి నిర్మించబడింది, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా తవ్వకంగా గుర్తింపు పొందింది. అజంతా మరియు ఎల్లోరా గుహల అసాధారణమైన చారిత్రక, కళాత్మక మరియు నిర్మాణ ప్రాముఖ్యతను గుర్తించి, 1983లో వీటిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు. ఈ గుర్తింపు ఈ గుహల విలువను, వాటిని పరిరక్షించాల్సిన అవసరాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది.

ప్రపంచానికి అద్భుతాలను అందించడంలో మన భారత దేశానికి ప్రముఖ పాత్ర ఉంది. ప్రధానంగా కళలకు పుట్టినిల్లయిన భారతదేశంలో అనితరసాద్యమైన శిల్పకళను మనం చూస్తాం. ప్రపంచానికి అద్భుత శిత్పకళను పరిచయం చేసే కళాఖండాలకు కొదవ లేదు. ఈ వీడియోలో ప్రపంచంలోనే అద్భుతాలుగాను, మిస్టరీగాను నిలిచిపోయిన భారత దేశంలోని ఐదు కళాఖండాలను మీకు పరిచయం చేస్తున్నాం. 

Post a Comment

0 Comments